కొర్రపాటివారిపాలెంకు చెందిన టీడీపీ సీనియర్ నేత కొర్రపాటిరవి(56) అనారోగ్యం తో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందారు. రవి గత రెండు రోజుల కిత్రం బ్రెయిన్ స్ట్రోక్తోతో తీవ్ర అ స్వస్థతకు గురై కోమాలోకి వెళ్లాడు. హుటా హుటిన ఒంగోలు కిమ్స్ ఆసుపత్రి నందు చేర్పించి చికిత్స చేయిస్తుండగా సాయంత్రం మృతి చెందాడు. మృతుడు సోదరుని భార్య శ్రీదేవి గ్రామ సర్పంచ్ (టీడీపీ) వున్నారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. టీడీపీ నేత రవి మృ తి చెందాడన్న సమాచారం తెలియగానే ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జానార్దన రావు ఆసుపత్రికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన వెంకట రాష్ట్ర నాటక అకాడమి కార్పోరేషన్ డైరెక్టర్ బి. ఓబుల్ రెడ్డి, రాష్ట్ర తెలుగు యువత కార్యాదర్శి గొల్లపూడి.వేణుబాబు, ఒంగోలు పార్లమెంట్ కార్యనిర్వహక కార్యదర్శి మానం రమేష్ బాబు తదితరులు ఉన్నారు.
