ఏకలవ్య నగర్ లో నివాసముంటున్న ఎస్టీలందరికి భూముల పంపిణీకి చర్యలు -తహసీల్దార్ రమణారావు

తూర్పుగంగవరం పంచాయతీ ఏకలవ్వనగర్ ఎస్టీ కాలనీలో నివాసముంటున్న అర్హులందరికి ప్రభుత్వభూముల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు తహసీల్దార్ బి. వి
రమణారావు తెలిపారు. రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల మేరకు తహసీల్దార్ రమణారావు ఏకలవ్వనగర్ కాలనీలో శనివారం విచారణ చేపట్టారు. ఎస్టీకాలనీ వాసులు ఎన్నో ఏళ్లుగా నివాసముంటూ ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వంపట్టాలు పంపిణీ చేయలేదు. గత 37 ఏళ్లుగా, సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములకు పట్టాలు ఇవ్వలేదని, తమకు తగు న్యాయం చేసి, పట్టాల పంపిణీ జరిగేలా చూడాలని ఆకాలనీ వాసులు రాష్ట్ర హైకో ర్టును ఆశ్రయించారు. హైకోర్టు విచారణ జరిపి ఆకాలనీకి చెందిన ఎస్టీలకు భూమ లు పంపిణీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు తహసీల్దార్ కోర్టును
ఆశ్రయించిన జాబితా ప్రకారం అందరిని పిలిపించి వారి ఆధార్ కార్డ్స్ , స్థాని కత, అర్హుల వివరాలను సేకరించారు. విచారణలో కాలనీ వాసులు తహసీల్దారకు పలు సమస్యలు విన్నవించారు. అటవి భూముల హక్కుల చట్టం ప్రకారం ఫారెస్ట్
భూములను పట్టాలుగా పొందిన వారికి మరళా అసైన్డ్ భూములు పంపిణీ చేయ వచ్చా అని ప్రశ్నించారు. ఇతర జిల్లా, ఇతరప్రాంతాలకు చెందిన వారికి పట్టాలు పంపిణీ ఎలా చేస్తారని, ఎంతో కాలంగా ఈ ప్రాంతాన్ని నమ్ముకుని జీవనం సాగి స్తున్న తమకు న్యాయం చేయాలని, తాము వేలాది రూపాయలు, శ్రమను ఖర్చుపెట్టి చదును చేసుకుని సాగు చేపట్టిన భూమిని కాదని మరో భూమిపట్టా ఇస్తే తమకు ఇబ్బందులు తప్పవని వాపోయారు. తహసీల్దార్ రమణారావు సిబ్బందితో కలసి కాలినడకన స్వయంగా తిరిగి ఎస్టీలు సాగు చేసుకుంటున్న భూములను పరిశీలించారు. ఎంత భూమి సాగులో వున్నది, ఎవరు సాగు చేస్తున్నారు ఏఏ పంటలు సాగు చేస్తున్నారో గుర్తించారు. విచారణ తరువాత తహసీల్దార్ ఎస్టీలతో మాట్లా డుతూ అర్హత గల వారందరికి పట్టాలు పంపిణీ చేస్తామని ఆందోళన చెందవద్ద న్నారు. కోర్టును ఆశ్రయించిన వారిలో అర్హులకు మొదటి ప్రాధాన్యత నిచ్చి తరుపరి మిగిలిన ఎస్టీలకు తప్పని సరిగా భూములు పంపిణీ చేయటం జరుగుతుందన్నా రు. ఈకార్యక్రమంలో మండల సర్వేయర్ మహేష్, ఆర్ ఎం. సుధీరకుమార్, విఆర్ వోలు రమణారెడ్డి, చంద్రశేఖర్ రావు, విలేజ్ సర్వీయర్ భవాని ఎస్టీలు ఇట్టాజాన్ పాల్, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *