చిన నాటి నుండే సాంకేతికతపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రధానోపాధ్యాయుడు వైఎస్ఆర్ కే ప్రసాద్ అన్నారు. తూర్పుగంగవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం లక్ష్య జాబ్ స్కిల్స్ అకాడమి ఆధ్వర్యంలో బి ఎఫ్ ఎస్ ఐ ఓకేషన్ ట్రైనర్ యరగొర్ల అంజి బాబు చాట్ జీపీటి, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పై విద్యార్థులకు పది గంటల కోర్సుపై అవగాహన కల్పించారు. ట్రైనర్ డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.
