ప్రకాశం జిల్లా, రాచర్ల మండలం, జేపీ చెరువు గ్రామ సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం శనివారం ఉదయం భక్తులు దైవ దర్శనానికి వచ్చి ఉన్న సమయంలో, వర్షాల వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో గుండ్లకమ్మ వాగులో ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. ఈ పరిస్థితిని గమనించిన ఆలయ అధికారులు, ఈఓ, మరియు స్థానిక పోలీస్ సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టారు.
పోలీసులు మరియు అధికారులు ట్రాక్టర్ల మరియు త్రాడు సహాయంతో భక్తులను సురక్షితంగా వాగును దాటించి, వారి ఇళ్లకు పంపించారు. ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా భక్తులను రక్షించగలిగారు. మధ్యాహ్నం తర్వాత భక్తులను ఆలయానికి అనుమతించరలేదని అధికారులు స్పష్టంగా తెలిపారు.
ప్రత్యేకంగా, రాచర్ల ఎస్సై కోటేశ్వరరావు స్వయంగా చిన్న పిల్లలను వాగును దాటించడంలో సహాయం చేసి, వారి భద్రతకు ప్రత్యేక శ్రద్ధ చూపారు. భక్తులకు అపాయం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

