జోరు వర్షం – పొంగిన వాగులు – పలు చోట్ల నీట మునిగిన కోతకు వచ్చిన వరి పైరు

జిల్లాలో గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రధాన వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నారు. దీంతో పలు చోట్ల రాక పోకలు స్థంభించాయి. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వారి తమ గమ్యాలకు చేరుకుంటున్నారు. గత నాలుగు రోజులుగా జిల్లాలో 2146.4 మి.మీలు జిల్లా నరినరి 55.03 మి.మీల వర్షపాతం నమోదు అయినది. అందులో శనివారం రాత్రి నుండి ఆదివారం ఉదయం వరకు హనుమంతుని పాడులో అత్యధికంగా 69.0మి.మీలు, తాళ్లూరులో 66.0, తర్లుపాడులో 64.2, పుల్లల చెరువులో 60.4, దర్శి, టంగుటూరులలో 46.2 చొప్పున, చీమకుర్తిలో 45.0, త్రిపురాంతకంలో 39.4, పెద్దారవీడులో 38.6, కనిగిరి 34.0, మర్రిపూడి 32.8, జరుగుమల్లి 32.4, ఒంగోలు అర్బన్, రూరల్ 30.6 చొప్పున, అర్ధవీడు 30.4, కొమరోలు 29.8, కొత్త పట్నం 28.8, సీఎన్ పురం 28.0, కొండెపి 27.6, బేస్తవారి పేట 27.4, మార్కాపురం 27.2, గిద్దలూరు 27.0, కొనకన మిట్ట 23.0, కంభం 22.6, కురిచేడు 20.2, ఎన్ కొండ 20.0, దోర్నాల, రాచర్లలలో 18.4 చొప్పున, దొనకొండ 18.2, యర్రగొండ పాలెం 16.6, మద్దిపాడు 15.6, ముండ్లమూరు 15.4, నాగులుప్పల పాడు 14.8, వెలిగండ్ల 14.4, పొదిలి 7.6, నంతనూతల పాడు 2.6, పీసీ పల్లి 1.2 మి.మీల చొప్పున నమోదు అయినట్లు వ్యవసాయశాఖ జెడీఏ శ్రీనివాన రావు తెలిపారు. ఈ వర్షం వలన ఎటువంటి పంటలకు పెద్దగా నష్టం లేదని చెప్పారు. అయితే ఖరీఫ్ సాగు చేసిన వరి 1010 మాత్రం పూర్తిగా నీటి మునిగినది. దీంతో రైతులు వర్షం తగ్గిన వెంటనే కొంత తెరప ఇచ్చిన సమయంలో పంట నుండి నీటిని బయటకు పంపి పంటను రక్షించే పనిలో నిమగ్నమైనారు. ఇదే వర్షాలు కొనసాగితే కోతకు వచ్చిన వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉన్నది. పొగనాట్లు సైతం దెబ్బతినే అవకాశం ఉన్నట్లు రైతులు చెబుతున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
ఉధృతంగా ప్రవహిస్తున్న దోర్నపు వాగు

రామభద్రపురంలో నేలకొరిగిన వరి పంట

రామభద్రపుర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *