స్వర్ణాంధ్ర – 2024లో బాగంగా జీరో ప్రాపర్టీ పీ-4పై నచివాలయ ఉద్యోగులు అవగాహన కలిగి మొబైల్ యాప్లో సమాచారాన్ని నమోదు చెయ్యాలని ఎంపీడీఓ అజిత అన్నారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశపు మందిరంలో మంగళవారం సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శులు, పీ – 4 సర్వే మాస్టర్స్ ట్రైనర్సుకు అవగాహన తరగతులు నిర్వహించారు. ఎంపీడీఓ అజిత మాట్లాడుతూ ..బంగారు కుటుంబాలు, మార్గదర్శుకుల మధ్య నచివాలయ ఉద్యోగులు అనుసంధాన కర్తలుగా వ్యవహరించాలని చెప్పారు. నిర్ణీత సమయంలో బంగారు కుటుంబాల అవసరాలను మార్గదర్శకులకు తెలియజెసి సహాయం బంగారు కుటుంబాలకు అందింటచం వంటి కార్యక్రమాలు నిర్వహించి యాప్లో నమోదు చెయ్యాలని తెలిపారు. కార్యాలయ పర్యవేక్షకులు సానికొమ్ము సత్యం, సిబ్బంది పాల్గొన్నారు.

