నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడికి డ్రోన్ కెమెరాలతో నిఘా -ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు

నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడికి జిల్లా వ్యాప్తంగా డ్రోన్ల సహాయంతో నిఘా ఎర్పాటు చేశామని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు
పేర్కొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఒంగోలు టౌన్ పరిధిలో ఇందిరమ్మ కాలనీ పరిసర ప్రాంతాలలో అకతాయిల అల్లర్లు చేస్తున్నారని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువచ్చిన స్థానికులు తీసుకువచ్చారు.

దీంతో వేంటనే స్పందించిన ఎస్పీ
ఒంగోలు టౌన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో ప్రత్యేక పోలీస్ బృందాలు మరియు డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.

అంతేకాకుండా పరిసర ప్రాంతాలలో పోలీసు అధికారులు మరియు పోలీస్ ప్రత్యేక బృందాలు ప్రజలతో మమైకమయ్యారు.

ఏదైనా సమస్య వస్తే.. వేంటనే తమ దృష్టికి తీసుకురావాలని స్ధానిక ప్రజలకు పోలీసులు తెలియచేశారు.

సమాచారం ఇచ్చిన వారి విషయాలు గోప్యంగా ఉంచుతామని స్ధానిక ప్రజలకు భరోసా ఇచ్చారు.

అంతేకాకుండా అనుమానాస్పదంగా కనిపించిన యువకులను పోలీస్ సిబ్బంది ప్రశ్నించి వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఇందిరమ్మ కాలనీలో పరిసర ప్రాంతాలలో స్పెషల్ పార్టీ టీంలు జల్లెడ పట్టారు.

హైవేలపై బైక్ రేసులు అరికట్టడం తోపాటు పేకాట స్థావరాలు, శివార్లలో ఓపెన్ డ్రింకింగ్ చేసి న్యూసెన్స్ క్రియేట్ చేయడం వంటి చట్టవ్యతిరేక/అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచి వాటిని నియంత్రించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

పోలీసులు వెళ్లలేని ప్రదేశాలకు డ్రోన్లను పంపి అక్కడి పరిస్థితులను సమీక్షించే వీలుంటుందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.

ఒంగోలు నగరంలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే సహించేదిలేదని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *