దర్శి లోని ఆదిత్య పంచకర్మ ఆయుర్వేద వైద్యశాల వారి ఆధ్వర్యంలో.., 'జాతీయ ఆయుర్వేద దినోత్సవం'ను గౌతమి గ్రామర్ స్కూల్ ఆవరణలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మానవత స్వచ్ఛంద సేవాసంస్థ ప్రధాన కార్యదర్శి,ప్రకాశం జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ(ఐఆర్సీయస్)ఎగ్జికూటివ్ మెంబర్ కపురం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. కపురం మాట్లాడుతూ ....పూర్వము గుప్తుల పరపాలనా కాలంనుండి ఇప్పటివరకూ ఆయుర్వేదానికి వన్నె తగ్గలేదనీ, ఇప్పటికీ ఎంతోమంది వనమూళికలమీద ఆధారపడి, ఎలాంటి రోగాలు దరిజేరకుండా వంద సంవత్సరాలకు పైబడి జీవిస్తున్నవారిని అనేకమందిని చేస్తున్నామన్నారు.ఒకప్పుడు మన ప్రాంతమంతా ప్రాణాంతకమైన ఫ్లోరైడు నీటినే తాగి, కీళ్ళకు,ఎముకలకూ సోకిన అనేక రోగాలతో సతమతమైతున్న రోజుల్లో, ఆనేక ఔషధ మొక్కలనుండి జాలువారిన వర్షపు నీటిని క్రిష్ణానది ఒడిసిపట్టి, నాగార్జునసాగర్ నుండి వచ్చిన ఔషధ గుణాలుగలిగిన ఎన్నేపీ నీరతోనే దరిశి ప్రాంతం సశ్యశామలమైనదని, లేకుంటే ఇప్పటికీ ఎముకలు,కీళ్ల వ్యాదులతో సతమతమయ్యేవారమనీ, మనము ఈరోజు ఈవిధంగా వున్నామంటే, అదంతా ఔషధ గుణాలు కలిగిన మొక్కలనుండి జాలువారిన నీటిబిందవులను వడిసిపట్టి మనకందించిన ఆయుర్వేద గుణాలు కలిగిన క్రిష్ణానదిలోని సాగర్ జలాల మహిమేనని గత దరిశి చరిత్రను సవివరంగా పూసగుచ్చినట్లు విద్యార్థులకు వివరించి,ఆయుర్వేదంపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో చందలూరు ఆయుర్వేద వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున్ రావు ఆయుర్వేదం గురించి అవగాహన కల్పించారు.స్కూల్ కరస్పాండెంట్ పి.రాజకేశవరెడ్డి,ఆదిత్య పంచకర్మ ఆయుర్వేద వైద్యశాల యువ డాక్టర్,హాస్పటల్ అధినేత శ్రీనివాసరావు,రిటైర్డ్ డీటీ వలి కుమార్, ఉపాధ్యాయులు నాగేశ్వరరావు,ధనిరెడ్డి వెంకటరెడ్డి,జి.వేణు,పాఠశాల సిబ్బంది,పురప్రముఖులు పాల్గొన్నారు. అతిధులను శాలువాతో,పూలమాలతో ఆదిత్య పంచకర్మ ఆయుర్వేద వైద్యశాల వారు ఘనంగా సన్మానించారు.