మెగా డీఎస్సీ -2025 లో ఎంపిక కాబడిన ఉపాధ్యాయులకు నియామక పత్రాల అందజేత కార్యక్రమం సందర్భంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒంగోలు నగరంలో ఏర్పాటు చేసిన రామచంద్ర మిషన్, సెయింట్ జే వియర్స్ హై స్కూల్, క్విస్ కళాశాల మరియు ఆక్సిలియం హై స్కూల్ నందు మొత్తం 4 కేంద్రాల్లో ప్రకాశం జిల్లా లో ఎంపిక కాబడిన 621 అభ్యర్థులు మరియు వారి సహాయకారిగా వారి కుటుంబం నుండి 1077 మంది మొత్తం 1698 మందికి వసతులు ఏర్పాటు చేయగా, సంబంధిత ఏర్పాట్లు ను బుధవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, విద్యా శాఖ అధికారులతో కలసి పరిశీలించారు. వీరిని ఈ నాలుగు కేంద్రాలనుండి 43 బస్సు లలో గురువారం జరగబోవు ముఖ్యమంత్రి చేతుల మీదగా నియామక పత్రాల అందజేత కార్యక్రమంనకు పంపించడం జరుగుతుంది.
ఈ నాలుగు కేంద్రాల్లో బస చేయు అభ్యర్ధులకు, వారి సహాయకారులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్, విద్యా శాఖాధికారిని ఆదేశించారు.

