జిల్లాలోని ఒంగోలు నగర కార్పోరేషన్ తో పాటు అన్నీ మున్సిపాలిటీలలో ప్రజల త్రాగునీటి అవసరాలు తీర్చడంలో ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
బుధవారం సాయంత్రం కలెక్టరెట్ లోని తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ అధికారులు, పబ్లిక్ హెల్త్ మరియు జిల్లా లోనీ అన్నీ మునిసిపాలిటీల కమీషనర్ల తో సమావేశమై ఆయా శాఖల ద్వారా అమలు జరుగుచున్న కార్యక్రమాల అమలు తీరును, అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలోని ఒంగోలు నగర కార్పోరేషన్ తో పాటు అన్నీ మున్సిపాలిటీలలో ప్రజల త్రాగునీటి అవసరాలు తీర్చడంలో భాగంగా చేపట్టిన పనుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేసేలా మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా సాలిడ్ వేష్ట్, లిక్యిడ్ వేష్ట్ మరియు డ్రై వేష్ట్ నిర్వహణ పై మున్సిపల్ కమీషనర్లు ప్రత్యేక శ్రద్ద తీసుకొని పట్టిష్టంగా అమలయ్యేలా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద చేపట్టిన పనులు త్వరగా పూర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఒంగోలు నగరంలోకి ప్రవేశించే ప్రదేశాన్ని పూర్తీ స్థాయిలో సుందరీకరణంగా అభివృద్ధి చేసేలా ప్రతిపాదనలు సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ ఒంగోలు మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు. ఒంగోలు నగరంలో చేపట్టిన ప్రధాన కాలువల పూడికతీత పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో 1౩.35 కోట్ల రూపాయలతో 96 పనులు చేపట్టడం జరిగిందని, ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన ఎల్ఆర్ఎస్ స్కీమ్ పై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టడం జరిగిందని జాయింట్ కలెక్టర్ మరియు ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ ప్రత్యేక అధికారి శ్రీ గోపాల క్రిష్ణ, జిల్లా కలెక్టర్ కు వివరించారు. స్వర్ణాంధ్ర 2047 లో భాగంగా రానున్న సంవత్సరాల్లో ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ ద్వారా 100 కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ చేసేలా యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ అధికారులకు సూచించారు. ఒంగోలు నగరాన్ని సంతోషకరమైన నగరంగా తీర్చిదిద్దేలా దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్, ఒంగోలు నగర కార్పోరేషన్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో ఒంగోలు మున్సిపల్ కమీషనర్ శ్రీ వెంకటేశ్వర రావు, పబ్లిక్ హెల్త్ ఈఈ సంజయ్ కుమార్, అన్నీ మున్సిపాలిటీల కమీషనర్లు, ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

