తల్లి పాలు అమృతంతో సమానమని ఐసీడీఎన్ సీడీపీఓ పరిమళ అన్నారు. విఠలాపురం పంచాయితీ పరిధిలో బుధవారం తల్లి పాల మాసోత్సవాలు, స్వస్త నారీ నస్త పరివార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ మా రవీంద్రసేనారెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు .తల్లిపాల ప్రాముఖ్యతను వివరించి పౌష్టికాహారం ప్రాధాన్యతను, స్థానికంగా నో కాస్ట్ లో కాస్ట్లో దొరికే సంవర్థకమైన ఆహారాన్ని ఉపయోగించుకోవాలని తాళ్లూరు పీహెచ్సీ వైధ్యాధికారి ప్రవీణ్ కుమార్, సీడీపీఓ పరిమళలు కోరారు. పౌష్టికాహార ప్రదర్శనను అంగన్ వాడీలు నిర్వహించారు. వైద్యశిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఐసీడీఎన్ సూపర్ వైజర్ ఇందిర, అంగన్వాడీ టీచర్లు పద్మజ, పుష్పలత, జి సుమలత, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

