బేగంపేట సెప్టెంబర్ 26(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఒత్తిడితో కూడిన జీవన శైలితో యువత లో గుండె జబ్బులు వస్తున్నాయని డాక్టర్ శ్రీధర్ కస్తూరి అన్నారు.వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో అవగాహన కార్యక్రమం ఓత్తిడితో కూడిన జీవనశైలితో యువతో పెరుగుతున్న గుండె జబ్బులు – డాక్టర్ శ్రీధర్ కస్తూరి
తల్లి కడుపులో పిండం తయారైన మూడు వారాల నుంచి 70 ఏళ్లు వచ్చే వరకు గుండె 2.5 బిలియన్ల సార్లు కొట్టుకుంటుందని కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ హెడ్ ఆఫ్ కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జన్, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీధర్ కస్తూరి తెలిపారు. వరల్డ్ హార్ట్ డేను పురస్కరించుకొని శుక్రవారం కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ బేగంపేటలో గుండె సంబంధ వ్యాధులు, ఆధునిక శస్త్రచికిత్సలు అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ హార్ట్ ఇనిస్టిట్యూట్ డాక్టర్ల సమక్షంలో కేక్ కట్ చేసి వరల్డ్ హార్ట్ డే ఈ సంవత్సరం థీం డోంట్ మిస్ ఎ బీట్ అనే అంశంపై ప్రసంగించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 1.7 కోట్లకు పైగా మరణాలు గుండె సంబధ సమస్యలతో సంభవిస్తున్నాయని, వీటిలో 80 శాతం ప్రాథమిక నిర్ధారణ, సకాలంలో వైద్యసేవలు, జీవణశైలి మార్పుతో అదుపు చేయవచ్చని డాక్టర్ శ్రీధర్ కస్తూరి తెలిపారు. తల్లి కడుపులో పిండం తయారైన మూడు వారాల నుంచి 70 ఏళ్లు వచ్చే వరకు గుండె 2.5 బిలియన్ల సార్లు కొట్టుకుంటుందన్నారు. డయాబెటీస్, స్మోకింగ్, రోజు రోజుకు పెరుగుతున్న మైక్రో ప్లాస్టిక్, ట్రాఫిక్ పొల్యూషన్ వంటి వాటికి ఎక్కువగా ఎక్స్పోజ్ కావడం గుండె సమస్యలకు కారణమవుతోందని, ఓత్తిడితో కూడిన జీవనశైలిలో గుండె వ్యాధులు కేవలం వృద్ధులకు మాత్రమే కాకుండా యువతలో కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. శారీరక శ్రమ, అసమతుల్య ఆహారం, మానసిక ఒత్తిడి యువతలో గుండె సమస్యలకు కారణమవుతున్నాయి. చిన్న చిన్న స్కానింగ్లు, పరీక్షలతో ముందుగానే ప్రమాద సూచికలను గుర్తించవచ్చని తెలిపారు. కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం, ఉప్పు, చక్కెర తక్కువ తీసుకుంటూ, కొవ్వును తగ్గించుకోవడం, ప్రతి రోజు వ్యాయామం, స్మోకింగ్, మధ్యపానాన్ని పరిమితం చేయడం, యోగా, ధ్యానం చేయడం వల్ల గుండెపై ఓత్తిడిని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్లు డాక్టర్
శైలేందర్ సింగ్, డాక్టర్ విజయకుమార్ రెడ్డి, కార్డియో థొరిసిక్ సర్జన్లు డాక్టర్ పి.ఎన్.రావు, డాక్టర్ సందీప్, డాక్టర్ శ్రీధర్ శాస్త్రి, కార్డియాజిస్టులు డాక్టర్ రాజారాం, డాక్టర్ ప్రణయ్, డాక్టర్ పార్థసారధి, డాక్టర్ సురేందర్, డాక్టర్ కావ్య, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ హిమాన్షు, డాక్టర్ అపరంజి, డాక్టర్ అవినిష్, డాక్టర్ కిషన్లు, డాక్టర్ వంశీ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్, కార్డియాక్ అనిస్ట్రేటిస్ట్ డాక్టర్ సుబ్రమణ్యం, డాక్టర్ రుద్ర, డాక్టర్ మంగళ, డాక్టర్ కృష్ణ కిరణ్, ఏవిపి చందర్ తదితరులు పాల్గొన్నారు.


