రాత్రి సమయంలో ప్రజలను అసభ్య పదాలతో దూషిస్తూ.. ఇబ్బందులు పెడుతున్న హిజ్రాలకు పోలీసులు కౌన్సిలింగ్

హిజ్రాలు వలన ఒంగోలు నగర ప్రజలు పడుతున్న భాదలను జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకురావడం జరిగింది.
దీంతో వేంటనే స్పందించిన జిల్లా ఎస్పీ నగరంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

నగరంలోని త్రోవగుంట నుండి ఎంజి పాడు వెళ్ళె మార్గము, కిమ్స్ హాస్పిటల్ ఏరియా, మార్కెట్ యార్డ్ సమీపంలో, మామిడిపాలెం చెరువు ఏరియా, ఒంగోలు టౌన్ పరిధిలో పోలీస్ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
ప్రజలను ఇబ్బందులు పెడుతున్న కొంత మంది హిజ్రాలను పోలీసులు గుర్తించారు.
హిజ్రాలకు పోలీసు సిబ్బంది కౌన్సిలింగ్ ఇచ్చారు.

ప్రజలు ఎడల హిజ్రాలు అమర్యాదగా వ్యవహరించడం వల్లన తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ.. కౌన్సిలింగ్ ఇచ్చారు.

రోడ్డు మీద వెళ్ళుతున్న బైక్స్, కార్లు, లారీ అడ్డంగా వచ్చి డబ్బులు వసూలు చేయడం తప్పని, అలా చేయడం వల్లన వెనుక ఉన్న వాహన చోదకులు తీవ్రంగా ఇబ్బంది పడటంతో యాక్సిడెంట్ కూడా జరుగుతున్నాయన్నారు.

ఇప్పుడుకైన హిజ్రాలు రోడ్డు మీద చేస్తున్న పొరపాటు పనులు మానుకొవాలని సూచించారు.

మరోసారి ప్రజల నుండి ఫిర్యాదులు వస్తే సహించేది లేదన్నారు.

పోలీసు నిబంధనలు హిజ్రాలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *