సి బి జి ప్లాంట్ (కంప్రెస్డ్ బయో గ్యాస్) ప్లాంట్ నిర్మాణానికి భూమి సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఏపీ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ విజయానంద్ దృష్టికి తీసుకువెళ్లారు. సి బి జి ప్లాంట్ నిర్మాణంపై నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, తిరుపతి జిల్లాల కలెక్టర్లతో చీఫ్ సెక్రటరీ విజయానంద్ శుక్రవారం రాజధాని అమరావతి నుంచి వీక్షణ సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సి బి జి ప్లాంట్ కి ప్రకాశం జిల్లాలో 4,993 ఎకరాల భూమి ఎంపిక చేశామని కలెక్టర్ తెలిపారు. మొదటి దశలో భూమి సేకరణ పూర్తయిందన్నారు. కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి భూమి సమస్య ఏమీ లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే నెడ్ క్యాప్, రిలయన్స్ సంస్థ సంయుక్తంగా ప్రకాశం జిల్లాలో సోలార్ పార్క్ నిర్మించనుందన్నారు. సోలార్ పార్క్ నిర్మాణానికి 90 వేల ఎకరాలు అవసరమని ప్రభుత్వం నుంచి అధికారికంగా లేఖలు అందాయన్నారు. *ఇందు కొరకు ప్రస్తుతం 55 వేల ఎకరాల భూమి అనువైనదిగా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించి, తహసిల్దార్లతో విచారిస్తున్నామని సి ఎస్ కి వివరించారు*. మిగిలిన భూమి పరిశీలనలో ఉందన్నారు. మూడు రోజుల్లో ప్లాంట్ కు సంబంధించిన ప్రత్యేక బృందం ప్రకాశం జిల్లాకు రానుందని, దస్త్రాలు సిద్ధం చేయాలని సిఎస్ తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, అనుబంధశాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

