ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి – ఎంపీపీ తాటికొండ

రైతులు నర్లబర్లీ పొగాకు సాగు మానివేసి ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి కోరారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో శక్రవారం రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కార్యక్రమం వ్యవసాయధికారి ప్రసాద రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొని ప్రత్యామ్నాయ పంటలపై కర పత్రాలను విడుదల చేసారు. వ్యవసాయాధికారి ప్రసాద రావు ప్రత్యామ్నాయ పంటల వివరాలు, దిగుబడి విషయాలను వివరించారు. రజానగరం నర్పంచి వలి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *