ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతి ఓటరు ఒక ఓటు మాత్రమే కలిగి ఉండాలి – జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు

ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతి ఓటరు ఒక ఓటు మాత్రమే కలిగి ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు పేర్కొన్నారు.
శుక్రవారం కలెక్టరేట్లోని డిఆర్ఓ చాంబర్ నందు జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఎన్నికల అధికారులతో కలిసి జిల్లాలో అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్. ఐ. ఆర్) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ… తప్పులు లేని ఓటరు జాబితా తయారీ, పోలింగ్ శాతం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, 18-19 వయసుగల యువత ఓటు నమోదు వంటి అంశాలపై తమ సూచనలు, సలహాలు అందించాలని ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. రెండేసి ఓట్లు కలిగిన వారు వెంటనే ఒక ఓటును రద్దు చేసుకుని, మీరు నివాసం ఉన్న చోట మాత్రమే ఓటును కలిగి వుండాలని అయన ఓటర్ల కు విజ్ఞప్తి చేశారు. ఓటుకు ఆధార్ అనుసంధానం చేసుకోని వారు ఆధార్ అనుసంధానం చేసుకోవాలన్నారు. 18 సంవత్సరలు నిండిన యువత ఓట్లు నమోదు చేసుకోవాలని, అలాగే ఒంగోలు నగరం మరియు జిల్లా లోని పట్టణాలల్లో డోర్ నెంబర్లు లేని యెడల డోర్ నెంబర్లు వేసేలా అధికారులు దృష్టి సారించాలన్నారు. జిల్లా లో చనిపోయిన వారి ఓట్లను వెంటనే ఓటరు లిస్టు నుండి తొలిగించాలని సూచించారు.
ఈ సమావేశంలో ఒంగోలు, కనిగిరి ఆర్డిఓ లు కళావతి, కేశవర్ధనరెడ్డి, స్పెషల్ డిప్యుటీ కలెక్టర్లు, ఎస్. జాన్సన్, ఎస్. కుమార్, ఎస్. వరకుమార్, ఎం. వి సత్యనారాయణ, కె. రవీంద్రారెడ్డి జిల్లా ఎలక్షన్ సెల్ సుపరింటెండెంట్ శ్రీనివాసరావు, పొలిటికల్ పార్టీల ప్రతినిధులు వైసీపీ దామరాజు క్రాంతికుమార్, జిల్లా ఎలక్షన్ సెల్ రీప్రజెటీటివ్, టీడీపీ కోనేటి వెంకటరావు కాంగ్రెస్ పార్టీ షేక్ సైదా, షేక్ రసూల్, బీజేపీ గుర్రం సత్యం, సిపిఎం రఘురామ్, బి.ఎస్.పి సుదర్శన్, జిల్లా ఎలక్షన్ సెల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *