కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు సంబంధించి కేటాయించిన రుణాల లక్ష్యాలను ఖచ్చితంగా సాధించాలి – జిల్లా కలెక్టర్ రాజాబాబు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు సంబంధించి కేటాయించిన రుణాల లక్ష్యాలను కచ్చితంగా సాధించడంతో పాటు జిల్లాలో ఉపాధి కల్పన యూనిట్స్ ఏర్పాటును ప్రోత్సహిస్తూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా జిల్లా అధికారులు, బ్యాంకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పేర్కొన్నారు.
శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ లోని సమావేశ హాలులో జిల్లా కలెక్టర్ రాజాబాబు అధ్యక్షతన డిస్ట్రిక్ట్ కన్సల్టెటివ్ కమిటీ (డి. సి.సి), డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ ( డి. ఎల్. ఆర్. సి) బ్యాంకర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2025- 26 ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో జిల్లాలోని అన్ని బ్యాంకులకు నిర్దేశించిన పలురకాల ఋణ లక్ష్యాలు, సాధించిన ప్రగతిని ఆయా బ్యాంకుల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా అధికారులు, బ్యాంకు అధికారులు సమన్వయంతో పనిచేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు సంబంధించి కేటాయించిన రుణాల లక్ష్యాలను బ్యాంకర్లు పూర్తిగా ఖచ్చితంగా సాధించాలన్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పని చేస్తున్నారని, అందుకనుగుణంగా యూనిట్స్ స్థాపనపై బ్యాంకర్లు, అధికారులు సమన్వయంతో యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా బ్యాంకర్లు, అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అలాగే జిల్లాలో ఉపాధి కల్పన యూనిట్స్ ఏర్పాటును ప్రోత్సహిస్తూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా పిఎంఈజిపి, ముద్ర, పీఎం విశ్వకర్మ, తదితర కేంద్ర, రాష్ట్ర పథకాలకు సంబంధించిన రుణాల లక్ష్యాలను తప్పనిసరిగా పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా పియం సూర్య ఘర్ పధకంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి నిర్దేశించిన లక్ష్యాలను సాధించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, విద్యుత్ శాఖ అధికారులను, బ్యాంకర్లను ఆదేశించారు.
ఈ సమావేశంలో లీడ్ జిల్లా మేనేజర్ రమేష్, డిఆర్డిఎ, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్లు నారాయణ, శ్రీహరి , వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్లు శ్రీనివాసులు, రవి కుమార్, శ్రీనివాస రావు, ఎస్.సి కార్పోరేషన్ ఈడి అర్జున్ నాయక్, సిపిడిసిఎల్ ఎస్ఈ వెంకటేశ్వరరావు, జిల్లా హార్టికల్చర్ అధికారి గోపి చంద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, అన్ని జిల్లా బ్యాంకు కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *