నగరంలోని భాగ్యనగర్ గుప్తాస్ రాయల్ అపార్ట్మెంట్లో దసరా శరన్నవరాత్రి ఉత్సవ సంబరాలు అంబరాన్ని తాకుచున్నాయి. అపార్ట్మెంట్లో ప్రత్యేకంగా సమావేశ మందిరాన్ని ఆలయముగా తీర్చిదిద్ది నవదుర్గాలను ప్రతిష్టింపజేసి పురోహితులు వేమూరి సంతోషి శబరినాధ్ శర్మ చేత ప్రతిరోజు పూజలు నిర్వహింపచేస్తూ ఆనాటి అమ్మవారి అలంకరణ విశేషాలను అందరికీ తెలియజేస్తూ పండుగ ప్రాశస్త్యమును ఈ తరం వారికి వివరిస్తున్నారు. పిల్లలు పెద్దలతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు పూజా క్రతువులో పాల్గొని తరిస్తున్నారు. శరన్నరాత్రి వేడుకలలో ఏడవ రోజు రాత్రి అమ్మవారి అలంకారం మహా చండి దేవి విశేషాలను తెలుపుతూ… నేటి ఉభయ దాతలు కోట మధుసూదనరావు, ఉషా మరియు విడియాల శంకర నరేంద్ర కుమార్, సువర్ణ దంపతులచే శాస్త్రోక్తంగా అష్టోత్తర శతనామపూజ నిర్వహింప చేశారు. అనంతరం మహిళలు సర్వాంగ సుందరముగా వివిధ పుష్పాలతో పూల బతుకమ్మను ఏర్పాటు చేసుకొని పాటలను పాడుచు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఉత్సాహంగా పెద్ద చిన్న తారతమ్యం లేకుండా సందడి చేశారు.
నవరాత్రి మహోత్సవాల నిర్వాహకురాలు నల్లమల్లి శ్రీ లక్ష్మీ మాట్లాడుతూ 100 గృహలుగల గుప్తా రాయల్ అపార్ట్మెంట్స్ లో ప్రతి సంవత్సరం హిందూ పండుగలను అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తుంటామని ఈ సంవత్సరం తొలిసారిగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను నిర్వహిస్తూ ఈరోజు బతుకమ్మను పెట్టుకొని పూజ నిర్వహించడం జరిగిందని తెలిపారు.
నల్లమల్లి శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో జరుగుతున్న దసరా వేడుకలను చీదెళ్ళ వెంకట లక్ష్మీరాజ్యం, బొగ్గవరపు వెంకట మానస, కొప్పరపు శైలజ, చందోలు లక్ష్మీ కుమారి, శినిగేపల్లి లీల, కావలి ఉషారాణి, నున్నా అన్నపూర్ణ, చందోలు పార్వతి, ఆకు నాగ ప్రవల్లికలు కార్యనిర్వహణ చేశారు.



