అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించిన తలసాని.

బేగంపేట సెప్టెంబర్ 29 (జే ఎస్ డి ఎం న్యూస్) :
దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా వివిధ అలంకారాలలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. సోమవారం మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట, రాంగోపాల్ పేట, అమీర్ పేట, సనత్ నగర్ డివిజన్ లలోని వివిధ దుర్గామాత మండపాలను దర్శించుకుని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం నిర్వాహకులు ఆయనను ఘనంగా సన్మానించారు.
బన్సీలాల్ పేట లో….
బన్సీలాల్ పేట డివిజన్ లోని జైనగర్, ఐ డి హెచ్ కాలనీ, అమ్ముగూడ, బన్సీలాల్ పేట, జీ వై ఆర్ కాంపౌండ్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాలలో పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే వెంట డివిజన్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు ఏసూరి మహేష్, లక్ష్మీపతి, ప్రేమ్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, గజ్జెల శ్రీనివాస్, వెంకట్ బాబు, అబ్బాస్, కొత్తూరు వెంకట్ తదితరులు ఉన్నారు.
రాంగోపాల్ పేట లో…
దేవీ నవరాత్రుల సందర్భంగా మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డివిజన్ పరిధిలోని హైదర్ బస్తీ, కస్తూర్బా నగర్, రాంగ్రీజ్ బజార్, రాణి గంజ్ తదితర ప్రాంతాల్లోని దుర్గామాత మండపాలను దర్శించుకుని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం నిర్వాహకులు ఆయనను సన్మానించారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ లు అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, అత్తిలి అరుణ గౌడ్, డివిజన్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కోటేశ్వర్ గౌడ్, సతీష్, గణేష్, మధు, ప్రేమ్, శ్రీనివాస్, జనార్దన్, రాజు, వెంకట్ తదితరులు ఉన్నారు.
అమీర్ పేట లోఅమీర్ పేట డివిజన్ లోని కుమ్మరి బస్తీ, బీ జే ఆర్ నగర్ కమిటీ హాల్, ఎస్సార్ నగర్ క్వార్టర్స్ , బాపూనగర్ లలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాలను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకుని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, డివిజన్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు నామన సంతోష్ కుమార్, అశోక్ యాదవ్, ప్రకాష్ గౌడ్, ప్రదీప్, గణేష్, కూతురు నర్సింహ, టిల్లు బాయ్, మధు, గౌతమ్, శ్రీకాంత్, సచిన్ తదితరులు పాల్గొన్నారు.
సనత్ నగర్ లో…
డివిజన్ లోని సుభాష్ నగర్, తులసి నగర్ తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దుర్గామాత మండపాలను దర్శించుకుని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యే ను సన్మానించారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, అమీర్ పేట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేష్ ముదిరాజ్, నాయకులు పీయూష్ గుప్తా, కొలన్ భూపాల్ రెడ్డి, ఆంజనేయులు యాదవ్, రాంమోహన్, శంకర్ గౌడ్ తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *