ప్రజల సమస్యల పరిష్కారం కొరకు జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుంది – జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

ప్రజల సమస్యల పరిష్కారం కొరకు జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

సోమవారం కనిగిరి లోని పవిత్ర ఫంక్షన్ హాల్లో జరిగిన ప్రజా పిర్యాదుల పరిష్కార వ్యవస్థ అర్జీల స్వీకరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, స్థానిక శాసన సభ్యులు డా ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి తో కలసి పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ప్రజాప్రతినిధులు, అధికారులు కలసి సమస్యల పరిష్కార దిశగా పయనించాలని జిల్లా కలెక్టర్ చెప్పారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, ప్రతి అర్జీని పరిష్కరించడానికి యంత్రాంగం సంసిద్ధంగా ఉందన్నారు. ప్రకాశం జిల్లా చాలా వైశాల్యంతో విస్తరించి ఉందన్నారు. ప్రతివారం జిల్లా కేంద్రమైన ఒంగోలులో జరిగే పిజిఆర్ఎస్ కార్యక్రమానికి ప్రజలు ప్రయాసపడి వస్తున్నారన్నారు. సుదూర ప్రాంతాల నుంచి ఒంగోలుకు రావాలంటే 5 గంటల సమయం పడుతుందని, తిరిగి వెళ్లడానికి మరో ఐదు గంటలు సమయం పడుతుందని గుర్తించి డివిజన్ స్థాయిలోనే పిజిఆర్ఎస్ ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు దగ్గరగా వెళ్లినట్లు ఉంటుందని, అలాగే ప్రజలకి నమ్మకం, భరోసా కలుగుతుందన్నారు. పిజిఆర్ఎస్ ఎక్కడ జరిగితే అక్కడకు జిల్లా అధికారులంతా విధిగా రావాల్సి ఉందన్నారు. జిల్లా అధికారులు మంచి ఆలోచనతో ప్రజల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యం కావాలన్నారు. కనిగిరి రెవిన్యూ డివిజన్ పరిధిలో పి జి ఆర్ ఎస్ నిర్వహణకు స్థానిక శాసనసభ్యులు ఉగ్ర నరసింహరెడ్డి ఎంతో సహకరించారన్నారు. ఆయన ప్రోత్సాహంతో ప్రజలు చైతన్యంతో ముందుకు వచ్చి తమ సమస్యలను విన్నవించుకున్నారని తెలిపారు. కనిగిరి రెవిన్యూ డివిజన్ పరిధిలోనే 814 అర్జీలు నమోదు కావడం శుభ పరిణామన్నారు. కలెక్టర్ మన దగ్గరకు వచ్చారు. మన సమస్యలు తీరిపోతాయంటూ ఫిర్యాదుదారులే నేరుగా వచ్చి తమ వినతి పత్రాలను అందచేశారన్నారు. నమోదైన అర్జీలలో 60 నుంచి 70 శాతం రెవెన్యూ సంబంధమైన సమస్యలేనన్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్, రెవెన్యూ అధికారులతో ప్రత్యేకంగా సమీక్షిస్తానన్నారు. అర్జీదారుల సమస్యలపై పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.
కలెక్టర్ వెంట కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గపూర్, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఆర్డిఓ కేశ వర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రజలు జిల్లా కేంద్రానికి రావడం వ్యయ ప్రయాసలతో కూడుకున్నందున, ప్రజల వద్ద కే వెళ్లి వారి సమస్యలను తెలుసు కునేందుకే డివిజన్ స్థాయిలో పిజిఆర్ఎస్ – జిల్లా కలెక్టర్ రాజాబాబు….

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం అందివ్వాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, అధికారులను ఆదేశించారు.
పిజిఆర్ఎస్ అమలులో భాగంగా ప్రకాశం జిల్లా, కనిగిరి డివిజన్ కు సంబంధించి సోమవారం ఉదయం కనిగిరిలోని పవిత్ర ఫంక్షన్ హాల్లో జరిగిన డివిజన్ స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అర్జీల స్వీకరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, కనిగిరి, మార్కాపురం శాసన సభ్యులు డా ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి, కందుల నారాయణరెడ్డి, కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గపూర్, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఆర్డిఓ కేశవర్ధన్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి, పార్థసారథి, జాన్సన్ లతో కలసి ప్రజల నుండి అర్జీలను
స్వీకరించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ద చూపాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంతో జిల్లా అధికారులు పనిచేయాలన్నారు. వైశాల్యం పరంగా జిల్లా విస్తీర్ణం ఎక్కువ గా ఉన్నందున
తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు జిల్లా కేంద్రానికి రావడం వ్యయ ప్రయాసలతో కూడుకున్నందున, ప్రజల వద్ద కే వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవాలన్న ఉద్దేశంతో డివిజన్ స్థాయిలో పిజిఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించాలన్న లక్ష్యంతో ఈ రోజు కనిగిరి డివిజన్ కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై ప్రజల నుంచి 814 అర్జీలు రావడం జరిగిందన్నారు. ఈ అర్జీలలో సుమారు 60 నుండి 70 శాతం మేర రెవెన్యూ సమస్యలపై రావడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని, అలాగే ప్రతి వారం సి ఎస్ గారు పి జి ఆర్ ఎస్ లో వచ్చిన అర్జీల పరిష్కారం పై ప్రత్యేక శ్రద్ధ తో సమీక్షించడం జరుగుచున్నదన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు పి జి ఆర్ ఎస్ లో వచ్చిన అర్జీల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి సారించి వచ్చిన ప్రతి అర్జీపై క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి నాణ్యమైన పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రెవెన్యూ అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ రోజు సుమారు 814 అర్జీలు రాగా రానున్న రోజుల్లో వచ్చిన అర్జీలకు పరిష్కారం చూపి అర్జీల సంఖ్య తగ్గించాలి గాని అర్జీల సంఖ్య పెరగ రాదన్నారు. పేద, మధ్య తరగతి వర్గాలకు ఎన్డిఏ ప్రభుత్వం జి ఎస్ టి ను తగ్గించి సూపర్ గిఫ్ట్ ఇవ్వడం జరిగిందన్నారు. జిఎస్టి తగ్గింపు లబ్ధి ప్రతి వినియోగదారునికి కచ్చితంగా అందాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రజలందరికీ అవగాహన కల్పించేలా క్షేత్ర స్థాయి నుండి అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా స్థానిక శాసన సభ్యులు డా ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి, వివిధ సమస్యలపై అర్జీలను జిల్లా కలెక్టర్ కు అందచేసారు.

ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్నీ శాఖల జిల్లా అధికారులు, డివిజన్, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *