హైదరాబాద్ సెప్టెంబర్ 29 (జే ఎస్ డి ఎం న్యూస్) :
వరల్డ్ హార్ట్ డే సందర్భంగా సోమవారం లకిడికపూల్ లోని గ్లెనిగల్స్ హాస్పిటల్లో డైరెక్టర్ క్యాథ్ ల్యాబ్ సర్వీసెస్ హెడ్ డాక్టర్ సాయి సుధాకర్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఓత్తిడితో కూడిన జీవన శైలితో వృద్ధాప్యంలో ఎదురయ్యే గుండె జబ్బులు యుక్తవయస్సులో యువత ఎదుర్కొంటున్నారని, శారీరక శ్రమ, అసమతుల్య ఆహారం, ఒబేసిటి, డయాబెటీస్ వంటి కారణాలతో గుండె సంబంధ సమస్యలుపెరుగుతున్నాయన్నారుప్రాథమిక దశలో గుండె సంబంధ సమస్యలను గుర్తిస్తే ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన థీం డోంట్ మిస్ ఏ బీట్ – మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోండి అనే నినాదంతో లకిడికపూల్ గ్లెనిగల్స్ హాస్పిటల్లో ప్రత్యేక యాంజియోగ్రామ్ ప్యాకేజీని నెల రోజుల పాటు అందుబాటులోకి తీసుకువస్తున్నామని డాక్టర్ సాయి సుధాకర్ తెలిపారు. చిన్న చిన్న పరీక్షలు, స్కానింగ్లతో గుండె జబ్బులనుగుర్తించిఅరికట్టవచ్చన్నారు. యువత ఓత్తిడికి దూరంగా ఉంటూ ప్రతి రోజు పది నిమిషాల వ్యాయామం చేస్తూ, పౌష్టిక ఆహారం తీసుకోవడంతో పాటు ఉప్పు, చెక్కర, ఆయిల్ తగిన మోతాదులో తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్లెనిగల్స్ హాస్పిటల్ కార్డియాక్ వాస్క్యులార్ సర్జన్ డాక్టర్ అజయ్ జోషి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పవన్ భట్నాగర్ తదితరులు పాల్గొన్నారు.

