హైదరాబాద్ సెప్టెంబర్ 29 (జే ఎస్ డి ఎం న్యూస్) :
ఆసియా కప్ లో అద్భుత ప్రతిభ కనబరిచి టీమిండియా కు కప్ సాధించడంలో కీలకపాత్ర వహించిన హైదరాబాది
క్రికెటర్ తిలక్ వర్మ కు శంషాబాద్ ఎయిర్పోర్టులో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ఎండి సోనీ బాలాదేవి గార్లు.ఘన స్వాగతం తెలియజేశారు.
పాకిస్తాన్ తో నిన్న జరిగిన ఆసియా కప్ ఫైనల్లో అద్భుతమైన ప్రతిభ ప్రదర్శించి హైదరాబాద్ తెలంగాణకే కాదు యావత్ దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన తిలక్ వర్మను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి అభినందించారు.
క్లిష్టమైన పరిస్థితుల్లో జట్టును గెలిపించిన విధానం యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆయన అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి చిలకవరం ప్రత్యేకంగా అభినందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో ఎండి సోనీ బాలాదేవితో పాటు పలువురు క్రీడా శాఖ పోలీస్ శాఖ ప్రోటోకాల్ విభాగం అధికారులు పాల్గొన్నారు.

