బేగంపేట సెప్టెంబర్ 30( జె ఎస్ డి ఎం న్యూస్) :
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి ఆలయంలో అమ్మవారు శ్రీ దుర్గా దేవి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు మంగళవారం పెద్ద ఎత్తున జంట నగరాలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. తీర్థ ప్రసాదాలను అందించారు.


