పొగాకు బోర్డు వేలం కేంద్రాన్ని పొగాకు బోర్డు డైరెక్టర్ విశ్వశ్రీ బుధవారం
సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి వద్ద ఉన్న పొగాకు స్టాకు ఎంత ఉన్నదో తెలుసుకున్నారు. ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2025 -26 పంట కాలానికి బోర్డు ఇచ్చిన పరిమితి మేరకే సాగు చేసుకోవాలని కోరారు. ప్లాట్ ఫామ్, గొడౌన్లను పరిశీలించారు. రీజనల్ మెనేజర్ రామారావు, ఒంగోలు – 2 వేలం నిర్వాహణాధికారి జె తులసి, వేలం నిర్వాహణాధికారి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

