అనుమతి లేకుండా బాణాసంచా నిల్వ – తయారీపై చట్టపరమైన చర్యలు – ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు -జిల్లా వ్యాప్తంగా బాణసంచా తయారీ కేంద్రాలు, స్టోరేజ్ గోడౌన్లు, విక్రయ కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

జిల్లా వ్యాప్తంగా రానున్న దీపావళి సందర్భంగా బాణసంచా తయారీ, నిల్వ కేంద్రాలు, దుకాణాలలో తప్పనిసరిగా ప్రభుత్వ నియమ నిబంధనలను పాటించాలని జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

దీపావళి పండుగ నేపథ్యంలో ఎస్పీ ఆదేశాలతో ఫైర్ క్రాకర్స్ షాపు నిర్వహకులు ఎక్కువగా క్రాకర్స్ నిల్వలు ఉంచిన వాటిపై ఫైర్ సేఫ్టీ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారా.. లేదా.. అనేదానిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది.

జిల్లా ఎస్పీ ఆదేశాలతో బాణసంచా తయారీ కేంద్రాల్లో, విక్రయ కేంద్రాల్లో పోలీస్ సిబ్బంది ఆకస్మికంగా తనిఖీలు చేశారు.

ఫైర్ క్రాకర్స్ షాపు నిర్వహకులు ఫైర్ అధికారులు ఇచ్చిన నిబంధనలకు అనుగుణంగా షాపు నిర్వహిస్తున్నారా.. లేదా అనేది పూర్తి స్థాయి లో పరిశీలించారు.

ఎదైన జరగరాని ఘటన జరినప్పుడు షాపులో అమర్చిన ఫైర్ పరికరాలు పని చేస్తున్నాయా లేదా అని చెక్ చేయటం జరిగింది.

బాణసంచా తయారీ కేంద్రాల్లో గాని లేదా విక్రయ కేంద్రాల్లో గాని 18 సంవత్సరాలు లోపు పిల్లలను ఉంచరాదని, ఏమైనా అనుకోని సంఘటనలు సంభవించిన ఎడల నివారణ కొరకు నీరు, ఇసుక, తదితర అగ్నిమాపక సామాగ్రిని తప్పనిసరిగా సిద్ధంగా ఉంచుకోవాలని యజమానులకు తెలియ చేసినారు.

అంతేకాకుండా తయారీ కేంద్రాలకు ఫైర్ ఇంజన్ సులభంగా చేరుకునేలా మార్గం ఉందా లేదా అనే అంశాన్ని కూడా పోలీసులు పరిశీలించారు.

పోలీసు నిబంధనలు ఎవరు ఉల్లంఘించిన అలాంటి వారిపై చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకుంటామవి హెచ్చరించారు.

ప్రభుత్వ నియమ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘించిన అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామవి హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *