కూటమి ప్రభుత్వం తగ్గించిన జి. ఎస్. టి ని సామాన్య ప్రజలు ఉపయోగించుకోవాలని జి. ఎస్. టి
డిప్యూటీ అసిస్టెంట్ కమీషనర్ సుధాకర్ రెడ్డి అన్నారు. తగ్గిన జీఎనీ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ బుధవారం మండల కేంద్రంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, జి. ఎస్. టి
డిప్యూటీ కమీషనర్ నుధాకర్ రెడ్డి, తహసీల్దార్ కెవి రమణా రావు, ఎంపీడీఓ అజిత, వ్యవసాయాధికారి ప్రసాద రావు తదితరులు పాల్గొని ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. తగ్గిన జీఎన్టీతోనే నిత్యావనర ఇతర వస్తువులు, మందులు అందజెయ్యాలని ఎవరైనా అమలు పరచకుంటే కఠిన చర్యలు తప్పవని జీఎస్టి డిప్యూటీ కమీషనర్ నుధాకర్ రెడ్డి చెప్పారు. కార్యక్రమంలో ఏపీఎం దేవరాజు ఏపీఓ వెంకట్రావు , స్థానిక నాయకులు ఐ శ్రీనివాస రెడ్డి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

