తాళ్లూరు మండలంలో 91.81శాతం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ అయినట్లు ఎంపీడీఓ అజిత తెలిపారు. మండలంలోని కొర్రపాటి వారి పాలెంలో పెన్షన్లను టిడిపి రాష్ట్ర యువత కార్యదర్శి గొల్లపూడి వేణుబాబు ఎంపీడీఓ అజిత పాల్గొని పెన్షన్ దారులకు పెన్షన్లు అందించారు. మండలంలో పలు రకాలు పెన్షన్లు 6180 మందికి గాను 5674 మందికి పెన్షన్లు అందించారు.
