బేగంపేట అక్టోబర్ 1(జే ఎస్ డి ఎం న్యూస్) :
ద్విచక్ర వాహనాన్ని డీ సి ఎం డీ కొన్న ఘటనలో ఒక బాలుడు అక్కడి కక్కడే మృతి చెందగా మరో బాలుడు గాయాలతో బయట పడిన సంఘటన రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.ఈ సంఘటనపై మృతుని తండ్రి సయ్యద్ జావిద్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.బేగంపేట ఓల్డ్ పాటిగడ్డకు చెందిన సయ్యద్ జావిద్ మెకానిక్ గా పని చేస్తున్నాడు.అతని కుమారుడు సయ్యద్ జయాన్ (10) 3వ తరగతి చదువు తున్నడు.ఇదే ప్రాంతానికి చెందిన అబ్దుల్ రెహాన్ వాళ్ళ బంధువు ఎం జీ రోడ్డు లోని ఓ దుకాణంలో పని చేస్తుంది.బుధవారం సాయంత్రం అబ్దుల్ రెహాన్ సయ్యద్ జయాన్ ను హోండా యాక్టివా పై ఎక్కించుకుని పాటి గడ్డ నుంచి ఎం జీ రోడ్డు లో వున్న ఆంటీకి టిఫిన్ బాక్స్ ఇచ్చేందుకు వెళ్ళారు.బాక్స్ ఇచ్చిన అనంతరం మళ్ళీ అదే ద్విచక్ర వాహనం పై పాటి గడ్డకు బయలు దేరారు.వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం ఎం జీ రోడ్డు లోని రాంగోపాల్ పేట పోలీసు స్టేషన్ వద్దకు చేరుకోగానే పక్కనే వస్తున్న డి సి ఎం వాహనం బాలురు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని హ్యాండిల్ కు డీ కొట్టింది.దీంతో ద్విచక్ర వాహనం పై వెనుక కూర్చున్న సయ్యద్ జయాన్ (10)డి సి ఎం కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న అబ్దుల్ రెహాన్ కు కూడా గాయాలయ్యాయి.వెంటనే వారిని గాంధీ ఆస్పత్రి కి తరలించారు.అయితే వాహనాన్ని నడిపిన అబ్దుల్ రెహాన్ మైనర్ నా మేజరా అన్నది తెలియాల్సి ఉంది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
