దసరా పండగ రోజు అమ్మవారి ఆలయాల్లో పూజలు……పలు గ్రామాలలో పారువేట మహోత్సవం నిర్వహణ…

తాళ్లూరు మండలంలోని పలు గ్రామాలలో బుధవారం విజయ దశమి పండుగను జరుపుకున్నాయి. అమ్మవారిని ఘనంగా పూజించి గ్రామోత్సవాలు నిర్వహించారు. తూర్పుగంగవరం, మాధవరం, బొద్దికూరపాడు, లక్కవరం గ్రామాలలో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేసారు. లక్కవరంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు ,ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి , జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తాళ్లూరులో దేవతా మూర్తుల విగ్రహాలను గ్రామాలలోని వీధులలో మేళ తాళాలతో బాణ సంచా కాలుస్తూ ఊరేగింపుగా తీసుకుళ్లారు. ఆయా గ్రామాలలో పారువేట కార్యక్రమాన్ని నిర్వహించారు. జమ్మిచెట్టు వద్ద పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీసభ్యులు, గ్రామపెద్దలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. తురకపాలెంలో పండుగ సందర్భంగా నిర్వహించిన కోలాటంలో వైసిపి జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూపల్లి వెంకాయమ్మ లు ముఖ్య అతిథి లుగా పాల్గొని కోలాటం లో చిన్నారులను మహిళలను ఉత్సాహపరిచారు. ఆయా గ్రామాల్లో వారికి మండల, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *