తాళ్లూరు మండలంలో ఘనంగా గాంధీజీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు

తాళ్లూరు మండలంలో అన్ని పంచాయితీలలో గాంధీ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, సర్పంచిలు మేకల చార్లెస్ సర్జన్, వలి, పీఎస్ శ్రీకాంత్ రెడ్డి ,
టిడిపి తెలుగు యువత కార్యదర్శి గొల్లపూడి వేణుబాబు, నీటి సంఘం ఉపాధ్యక్షుడు తూము శివ నాగి రెడ్డి నాయకులు ఇడమకంటి శ్రీనివాస రెడ్డి, కార్యాలయ సిబ్బంది గాంధీజీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. బెల్లంకొండ వారి పాలెంలో సర్పంచి పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీటీసీ జీఎస్ ప్రభాకర్ రెడ్డిలు మహాత్మునికి నివాళులు అర్పించారు మల్కాపురంలో సర్పంచి వలి మహాత్ముని విగ్రహానికి పూల మాలలు వేసి నివాలులు అర్పించారు. సర్పంచి
శ్యామ్సన్, వైస్ సర్పంచి ప్రసాద్ రెడ్డి, ఎంపీటీసీ బాల కోటయ్య ,ఇతర ఉద్యోగుల పాల్గొని ఘన నివాళులు అర్పించారు. మాధవరంలో సర్పంచ్ తాటికొండ రేణుక, గ్రామ కార్యదర్శి అల్లం వెంకటేశ్వర్లు బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తాళ్లూరులో సర్పంచ్ మేకల చార్లెస్ సర్జన్ , గ్రామ కార్యదర్శి షహనాజ్ బేగం , స్థానిక నాయకుడు శ్రీనివాస్ రెడ్డి మహాత్ముని చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు.
పలు పంచాయితీలలో బాపూజీ తోపాటు లాల్ బహుదూర్ శాస్త్రి చిత్ర పటాలకు పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. దేశానికి వారు చేసిన సేవలను కొనియాడారు. నేటి యువత ఆయన సిద్ధాంతాలను పాటిస్తే సమాజం ఎంతో ఉన్నత స్థానంలో ఉంటుందని అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
తాళ్లూరులో నివాళులర్పిస్తున్న ఎంపీపీ ,జడ్పిటిసి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *