జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు -గాంధీజీ కన్న కలలు సాకారం చేసేందుకు మనందరం కృషి చేద్దాం – జిల్లా ఎస్పీ

భారత స్వాతంత్య్రోద్యమంలో మహనీయుడు, అహింసావాది, జాతిపిత మహాత్మా గాంధీ 156 వ జయంతి సందర్భంగా గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ మరియు పోలీస్ అధికారులు ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ భరత జాతిని ఏకతాటిపై నడిపించి బ్రిటీష్ సామ్రాజ్యంపై శాంతి, అహింసలతో పోరాడి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయులు గాంధీజీ అని అన్నారు. ప్రపంచం చరిత్రలో మహోన్నత వ్యక్తిగా, భారత జాతిపితగా చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. బాపూజీ జీవితం, ఆయన ఆదర్శాలు సత్యం, అహింస, ధర్మ మార్గాలు ప్రతి తరానికి స్ఫూర్తినిస్తూనే ఉంటాయని, మహాత్ముని బోధనలు, ఆదర్శాలు, జీవిత విలువలను అనుసరిస్తూ శాంతి, సమానత్వం, మతసామరస్యాన్ని పాటిస్తూ ముందుకు సాగాలని, ఆయన కలలు కన్న దేశాన్ని రూపొందించడానికి మనమంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ రమణ కుమార్, ఎఆర్ డిఎస్పీ చంద్ర శేఖర్, ఎస్బి ఇన్స్పెక్టర్ కె.వి.రాఘవేంద్ర, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సుధాకర్, ఒంగోలు తాలూకా సిఐ విజయ కృష్ణ, డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ దేవప్రభాకర్, సిసిఎస్ సీఐ జగదీష్, ఆర్ఐలు రమణా రెడ్డి, సీతారామరెడ్డి, ఎస్సైలు, ఆర్ఎస్సైలు, పోలీస్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *