జాతిపిత మహాత్మాగాంధీ జయంతి ,భారతదేశ రెండవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రీ జయంతి కార్యక్రమాన్ని మానవత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దర్శి సబ్ జైలులో మానవత స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో ఇరువురి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మానవత సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి కపురం శ్రీనివాసరెడ్డి పాల్గొని మాట్లాడుతూ… మహాత్మాగాంధీ ఆశయాలకనుగుణంగా జైలులోని ఖైదీలకు “పరివర్తన” అనే అంశం ను ఉదాహరణలతో వివరించారు.
జైల్లో వారి నడవడికలో భాగంగా మంచి సత్ప్రవర్తన కలిగివుండాలని, ఖైదీలందరూ దైవ చింతనతో పాటుగా దేశభక్తినికలిగి, దేశంకోసం పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను ఎప్పటికీ మరవకూడదని, గాంధీ జీ ఒక్క భారతదేశ ప్రజానీకానికే గాకుండా యావత్ ప్రపంచానికే,ఆదర్శ మూర్తి,చిరస్మరణీయుడని కొనియాడారు .మీకు అన్నీ విషయాలలో మానవత సంస్థ అండగా వుంటుందని కపురం శ్రీనివాసరెడ్డి తెలిపారు. మానవత సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్.రామచంద్రారెడ్డి ని ఆదర్శంగా తీసుకొని పండ్లు,మిఠాయిలు,దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు దేవతి వరప్రసాదరావు, ధనిరెడ్డి వెంకటరెడ్డి, జి.వేణు,ఖాదర్ మస్తాన్,రోశారావు,మోషే పాల్గొన్నారు.

