బేగంపేట అక్టోబర్ 3(జే ఎస్ డి ఎం న్యూస్) :
అహింస, సత్యాగ్రహం లను మార్గాలుగా చేసుకొని దేశ స్వాతంత్య్రం కోసం ఎంతో కృషి చేసిన మహనీయుడు మహాత్మాగాంధీ అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గురువారం మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఎంజీ రోడ్ లోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ లు అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, అత్తిలి అరుణ గౌడ్, బిఆర్ఎస్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు టి. శ్రీహరి, నాగులు, మహేష్ యాదవ్, లక్ష్మీపతి, గణేష్, సతీష్, పబ్బా ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.


