బేగంపేట అక్టోబర్ 3(జే ఎస్ డి ఎం న్యూస్) :
దసరా శరన్నవ రాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం బేగంపేట ప్రకాశం నగర్ లోని శ్రీ భూలక్ష్మీ దేవాలయంలో ఏ ఐ సి సి మీడియా అండ్ పబ్లిసిటీ చైర్మన్ పవన్ కేరా, టీ పీ సి సి ఉపాధ్యక్షురాలు కోట నీలిమలు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త విశాల్ సుధాం వారిని ఆహ్వానించి పూజలు నిర్వహింప జేశారు.వారిని శాలువాలు,పూల మాలలతో ఘనంగా సత్కరించారు.అమ్మవారి చిత్ర పటాలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో విశాల్ సుధాం తో పాటు త్రికాల మనోజ్ ,చిరంజీవి,అర్చకులు మఠం సదాశివుడు,తదితరులు పాల్గొన్నారు.



