రైతుల అభ్యున్నతికి ప్రభుత్వాలు పలు రకాల చేయూత ఇస్తున్నట్లు వాటిని ఉపయోగించుకుని మార్కేట్ డిమాండ్కు అనుకూలంగా పంటలను పండించి లాబాల బాటలో రైతులు నడవాలని ఆంధ్ర ప్రదేశ్ ఔషధ మరియు సుగంధ మొక్కల బోర్డు కార్యానిర్వాహణాధికారి చంద్రశేఖర్ కోరారు. శివరామపురం వద్ద నూతనంగా రైతు సాధికార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కావ్య అగ్రికల్చర్ సోల్యూషన్స్ ప్రారంబోత్సవ శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రైతు సాధికార సంఘం చైర్మన్ గిరిధర్ అధ్యక్షతన ప్రారంబోత్సవ సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఈఓ చంద్రశేఖర్ మాట్లాడుతూ రైతులు డిమాండ్ ఉన్న పంటల వైపు దృష్టి సారించాలని కోరారు. ఒకే పంటను అధికంగా సాగు చేయటం వలన డిమాండ్ తగ్గి రేట్లు తగ్గుతున్నాయని వివరించారు. ప్రభుత్వం ఔషద మొక్కల పెంపకంకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ఫెర్టిసైడ్స్ రహిత కావ్య అగ్రి సొల్యూషన్స్ ఫ్యాక్టరీని ప్రారంభించి రైతులను ప్రొత్సహించటం అభినందనీయమని అన్నారు.
డిప్యూటీ సీఈఓ ప్రదీప్, తోట మెనేజింగ్ డైరెక్టర్ జగదీష్, రైతు సాధికార సంఘం వైస్ చైర్మన్ సుజాత, డైరెక్టర్ విజయ, మాజీ బ్యాట్మెంటెన్ కోచ్ పున్నయ్య చౌదరి, వ్యవసాయ నిపుణులు డి వి ఆర్ రాజీవ్ మోహన్ లు పాల్గొని రైతులకు ఔషద మొక్కల పెంపకం వలన కలిగే లాభాలను, అందుబాటులోనికి ఫ్యాక్టరీ రావటం వలన ఈ ప్రాంత రైతులు ఎంతో అభివృద్ధి చెందుతారని అందుకు రైతు సాధికార సంస్థ చైర్మన్ గిరిధర్ చేస్తున్న కృషిని అభినందించారు. అనంతరం వారి అగ్రికల్చర్ ఉత్పత్తులను ప్రారంభించారు. శివరామపురంకు చెందిన పలువురు ఔత్సాహిక రైతులను సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ లక్ష్మి నారాయణ, ముప్పలనేని తిరుపతి స్వామి, అఫ్రాయిమ్ తదితరులు పాల్గొన్నారు.

