తాళ్లూరు మండలంలోని శివరామపురం పంచాయితీలో నిథుల దుర్వినియోగంపై ఆపంచాయితీ ఉప సర్పంచి నారిపెద్ది రామ్మూర్తి ఫిర్యాదు మేరకు డీఎల్పీఓ పద్మజ శుక్రవారం విచారణ చేపట్టారు. 2017, 18వ సంవత్సరంలో జరిగిన పనులకు పంచాయితీ తీర్మాణాలు ఇచ్చి బిల్లులను డ్రా చేయటమే కాకుండా, బ్లీ చింగ్, లైట్స్ పంచాయితీలో వేయ్యకుండా కార్యాలయంలో మెటీరియల్ తేకుండా బిల్లులు డ్రా చేసారంటూ పలు ఆరోపణలు చేయటంలో పూర్తి స్థాయిలో విచారణచేపట్టారు. మాజీ ఎంపీటీసీ లక్ష్మి నారాయణ, సర్పంచి బొడ్డు రాములు కుమారులను, గ్రామ నాయకులు హనుమంత రావు లను పిలిచి విచారణ నిర్వహించారు. పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని డీ ఎల్పీఓ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రజిత, డిప్యూటీ ఎంపీడీఓ నాగ మల్లేశ్వరి, గ్రామకార్యదర్శులు షహనాజ్ బేగం, రాజా రమేష్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
