బేగంపేట అక్టోబర్ 4(జే ఎస్ డి ఎం న్యూస్) :
లోతుకుంట వద్ద ఓ సైకిల్ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం లో పక్కనే ఉన్న ఆరు దుకాణాలు దగ్దం కాగా ,భారీ ఆస్తి నష్టం సంభవించింది.సికింద్రాబాద్ లోతుకుంట ప్రధాన రహదారి పక్కనే ఉన్న సైకిల్ దుకాణంలో చెలరేగిన మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించడంతో అగ్నిప్రమాద తీవ్రత పెరిగింది. ఈ అగ్ని ప్రమాద ఘటనలో ఆరు దుకాణాలు దగ్ధం కాగా భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో సకాలంలో ఘటన స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దుకాణాలలో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించి ఇతర దుకాణాలకు మంటలు వ్యాపించినట్లు అగ్నిమాపక అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.మంటలు అంటుకున్న దుకాణం ప్రధాన రోడ్డుకు పక్కనే ఉండటం తో ట్రాఫిక్ పోలీసులు ఆ సమయంలో ట్రాఫిక్ అటు వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.


