తాళ్లూరు మండలంలోని వెలుగు వారి పాలెంకు చెందిన టిడిపి ప్రముఖ నాయకుడు, పార్టీ ఒంగోలు పార్లమెంటు కార్యనిర్వాహణ కార్యదర్శి, మాజీ యూత్, మండల పార్టీ అధ్యక్షుడు శాగం కొండా రెడ్డి (54) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. ఆయన గత మూడు దశాబ్ధాలుగా తెలుగు దేశం పార్టీలో క్రీయాశీలక నాయకుడిగా పనిచేస్తూ యూత్ అధ్యక్షడిగా, మండల పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంటు కార్యనిర్వాహణ అధ్యక్షుడిగా క్రీయాశీలకంగా వ్యవహరించి పార్టీ అభ్యున్నతికి తన వంతు చేయూత అందిస్తూ నియోజక వర్గంలో మంచి పట్టు నిలుపుకున్నారు. దీంతో ఆయన మృతి పట్ల నియోజక వర్గంలో టిడిపి శ్రేణులు తీవ్ర సంతాపం వ్యక్తం చేసారు. టిడిపి నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత సాగర్, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, పారిశ్రామిక వెత్త శిద్ధా సుధీర్ కుమార్, హర్షిణి విద్యాసంస్థల అధినేత గోరంట్ల రవి కుమార్, దర్శి మున్సిపాలిటి చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, నాటక కళాపరిషత్ చైర్ పర్సన్ బొమ్మి రెడ్డి ఓబులు రెడ్డి, పార్లమెంటు పార్టీ కార్యదర్శి మానం రమేష్ బాబు, పిన్నిక రమేష్ రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి గొల్లపూడి వేణుబాబు, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్ పెద కాలేషా వలి (బడే), నవులూరి విద్యా సాగర్ వెలుగు నుబ్బా రావు నీటి సంఘ ఉ పాధ్యక్షుడు తూము శివ నాగి రెడ్డి, నునుం ఆదినారాయణ సొసైటీ చైర్మన్లు గొంది రమణా రెడ్డి, వల్లభనేని సుబ్బయ్య, నాగేశ్వర రావు, డాని నూరా రెడ్డి, క్లస్టర్ ఇన్చార్జి వెంకట రావు, రామయ్య, నంగాతిరుపతి రావు తదితరులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
సర్పంచిల సంఘ అధ్యక్షుడు మారం ఇంద్ర సేనా రెడ్డి, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, సర్పంచి లు పీ ఎన్ శ్రీకాంత్ రెడ్డి, వలి లతో పాలు పలువురు నర్పంచిలు, ఎపీటీఎఫ్ మండల శాఖ వేరు ప్రకటనలలో శాగం మృతి తీవ్ర సంతాపం వ్యక్తంచేసారు.



