బేగంపేట అక్టోబర్ 6(జే ఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయం లో మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పూజలు నిర్వహించారు.సోమవారం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తన పుట్టినరోజు సందర్భంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.
అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. ఆలయ ఆవరణలో పార్టీ నాయకులు, ఆలయ మాజీ సభ్యుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు తులభారం నిర్వహించారు. తదనంతరం ఆలయం బయట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారీ కేక్ ను కట్ చేశారు. కార్యక్రమానికి సనత్ నగర్ నియోజకవర్గంతో పాటు నగరంలో ని వివిధ ప్రాంతాలు, ఇతర జిల్లాల నుండి వచ్చిన పార్టీ నాయకులు, అభిమానులు, మిత్రులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పూలమాలలు, శాలువాలు, పుష్పగుచ్చాలతో సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా పద్మారావు నగర్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన తలసాని శ్రీనివాస్ జీవిత నేపధ్యం, రాజకీయ ప్రస్థానం, సాధించిన విజయాలను వివరించే డాక్యుమెంటరీ ని ప్రదర్శించారు. అదేవిధంగా బేగంపేట డివిజన్ కు చెందిన నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో వికలాంగులకు ట్రై సైకిళ్లను అందజేశారు. కార్వాన్ కు చెందిన నాయకుడు శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ పూలమాలను క్రేన్ సాయంతో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అలంకరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ లు టి. మహేశ్వరి, కుర్మ హేమలత, మాజీ కార్పొరేటర్ లు అత్తిలి అరుణ గౌడ్, అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, కె. కిరణ్మయి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ లు దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, గజ్జెల నగేష్, నాంపల్లి నియోజకవర్గ ఇంచార్జి ఆనంద్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, కొలన్ బాల్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వెంకటేషన్ రాజు, నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, శ్రీహరి, కె.కిషోర్ కుమార్, నాగులు, ఏసూరి మహేష్, లక్ష్మీపతి, మహేష్ యాదవ్, ప్రేమ్, బాలరాజ్ యాదవ్, శైలేందర్, సాగర్ ముదిరాజ్, ఆంజనేయులు, శ్రీకాంత్ రెడ్డి, శేఖర్, కుమార్ యాదవ్, రామ్ నివాస్ బన్సాల్, పీయూష్ గుప్తా, మహేందర్, ఆనంద్ పాటిల్, చంద్ర ప్రకాష్, గణేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.




