హైదరాబాద్, అక్టోబర్ 5,‘ (జే ఎస్ డి ఎం న్యూస్) : పాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు ఇటీవలి కాలంలో గణనీయంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు పాంక్రియస్‌కు శస్త్రచికిత్స చేయాలంటే సవాలు తో కూడుకున్నది. కానీ, వైద్యశాస్త్రంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. పాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కూడా అత్యాధునిక పద్ధతిలో రోబోటిక్ శస్త్రచికిత్సలు చేస్తున్నారు. దానివల్ల కుట్లు మరింత సున్నితంగా వేయగలగడంతో పాటు మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. సర్జికల్ ఆంకాలజిస్టులు, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు అందరూ ఈ కొత్త పరిజ్ఞానం గురించి తెలుసుకుని రోగులకు మెరుగైన చికిత్సలు అందించడానికి కృషిచేయాలి. అందుకు ఇలాంటి సీఎంఈ (కంటిన్యువస్ మెడికల్ ఎడ్యుకేషన్) సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయి. కిమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఇలాంటి సదస్సులను నిర్వహిస్తూ వైద్యలోకానికి మెరుగైన విజ్ఞానాన్ని అందిస్తున్నందుకు మా వైద్య బృందానికి అభినందనలు’’ అని *కిమ్స్ ఆస్పత్రుల ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు అన్నారు.* సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో నిర్వహించిన ‘పాంక్రియాటిక్ క్యాన్సర్ 360’ అనే సీఎంఈ సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సదస్సుకు హైదరాబాద్ నగరంలోని పలు ప్రధాన ఆస్పత్రులకు చెందిన ప్రఖ్యాత క్యాన్సర్ నిపుణులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో సర్జికల్ ఆంకాలజిస్టులు, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సదస్సుకు ఆర్గనైజింగ్ సెక్రటరీగా వ్యవహరించిన కిమ్స్ ఆస్పత్రి సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, రోబోటిక్ పాంక్రియాటిక్ సర్జన్ డాక్టర్ మధు దేవరశెట్టి మాట్లాడుతూ,మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో పాంక్రియాస్ (క్లోమం) ఒకటి. ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తూ మధుమేహాన్ని అదుపులో ఉంచడమే కాక, ఆహారాన్ని విచ్ఛిన్నం చేసి జీర్ణక్రియకు దోహదం చేసే ఎంజైమ్‌లను కూడా ఉత్పత్తి చేస్తుంది. ఇంత కీలకమైన పాంక్రియాస్‌కు క్యాన్సర్ వస్తే ఇంతకుముందు శస్త్రచికిత్సలు చేయడం చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు ఓపెన్, ల్యాపోరోస్కోపిక్, రోబోటిక్ పద్దతులు ఉన్నాయి. రోబోటిక్ పద్దతి ఉపయోగించడం వల్ల రోగులకు మరింత మెరుగైన ఫలితాలు అందుతున్నాయి. పాంక్రియాస్‌కు శస్త్రచికిత్సలు చేయగలుగుతున్నాం. అందులో ఏర్పడిన క్యాన్సర్ కణితిని పూర్తిగా తొలగించి, కుట్లు వేయడం కూడా రోబోటిక్ శస్త్రచికిత్సలో సాధ్యమవుతోంది. అత్యంత కచ్చితత్వంతో కుట్లు వేయడం వల్ల అది పూర్తిగా అతుక్కుని, లీకేజీ బాగా తగ్గింది. దీనివల్ల ఐసీయూలో, హాస్పిటల్ లో రోగులు కోలుకోవడానికి పట్టే సమయం కూడా గణనీయంగా తగ్గిపోయింది. దీంతో వారు తమ విధులు, పనులు త్వరగా చేసుకోగలుగుతున్నారు. అంతేకాకుండా ఇతర చికిత్సలను సైతం తట్టకోగలుగుతున్నారు. ఇంతకుముందు కంటే శస్త్రచికిత్సల తర్వాత రోగులు జీవించే కాలం కూడా గణనీయంగా పెరిగింది. ఇటువంటి సదస్సుల వల్ల ఒక ప్రోటోకాల్ పద్దతిలో క్యాన్సర్ చికిత్సలు జరగుతున్నాయి దీంతో రోగులకు మెరుగైన ఫలితాలు వస్తున్నాయి’’ అని చెప్పారు.అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఇన్ ఇండియా (ఏఎస్ఐ) సహకారంతో నిర్వహించిన ఈ సదస్సులో కిమ్స్ ఆస్పత్రి సీఈఓ డాక్టర్ అభినయ్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సంబిత్ సాహు, క్యాన్సర్ వైద్య నిపుణులు డా. ఎం. శ్రీనివాసులు, డా. టి. సుబ్రహ్మణ్యేశ్వరరావు, డా. కేవీవీఎన్ రాజు, డా. జగదీశ్వర్ గౌడ్, డా. నాగేంద్ర పర్వతనేని తదితర వైద్య ప్రముఖులు పాల్గొని, పాంక్రియాటిక్ క్యాన్సర్‌కు సంబంధించి చేసే చికిత్సల్లో వస్తున్న ఆధునిక మార్పుల గురించి, శస్త్రచికిత్సలో వైద్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సమగ్రంగా వివరించారు. ఈ సదస్సుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 250 మంది వరకు వైద్యులు హాజరయ్యారు.
