సుప్రీం కోర్టు చీఫ్ జస్టిష్ గవావ్ పై దాడిని జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు దార అంజయ్య తీవ్రంగా ఖడించారు. తాళ్లూరు ఎస్సీ కాలనీలో అంబేడ్కర్ విగ్రహం వద్ద సంఘం ఆధ్వర్యంలో నిరసనను వ్యక్తం చేసారు. భారత దేశ అత్యన్నత న్యాయ స్థానంలో జస్టిన్ గవావ్ పై దాడి జరగటం హేయమైన చర్యల అని అన్నారు. లాయర్ కిషోర్ ను బార్ కౌన్సిల్ నుండి వెంటనే శాశ్వితంగా డీబార్ చెయ్యాలని, ఆయన పట్టాను రద్దు చెయ్యాలని కోరారు. ఒక కేసు విషయంలో దేవుడికి అడగండి అని వ్యాఖ్యానించినట్లుగా ప్రచారం చేసి హిందూ ధర్మాన్ని వ్యతిరేకించినట్లు ప్రచారం నిర్వహించి లాయర్ రాకేష్ కిషోర్ తన బూటు కాలు విసరట భారత దేశ చరిత్రలో ఒక చీకటి రోజని అన్నారు. తక్షణం ఆయనను ఆరెస్ట్ చేసి ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చెయ్యాలని కోరారు.
