తాళ్లూరు మండలంలోని దారం వారి పాలెంకు చెందిన ప్యాస్టిక్ వ్యర్ధాలు సేకరించి కుటుంబాలకు చెందిన నాగులూరి పౌలు, సుభాషిని దంపతులకు ఆరుగురురు సంతానం అందులో కుమార్తెలు ఆదర్శ, మేఘనలను నెల్లూరు జిల్లా బాతుల పెంపకం దారుడు ప్రసాద్ వద్ద గత రెండు సంవత్సరాల క్రితం కూలీకి పంపాడు. గడువు ముగిసినా సరే బాతుల పెంపకం దారు వారి పిల్లలను అప్పగించక పోక పోవటంతో డిబిఆర్సీ జిల్లా కోఆర్డినేటర్ దార్ల కోటేశ్వర రావును ఆశ్రనయించారు. ఆయన అధికారుల దృష్టికి, న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లి కాకినాడ ప్రాంతంలో అక్రమ నిర్బంధంలో ఉన్న చిన్నారులకు విడిపించి నెల్లూరుకు పంపారు. సోమవారం డిఆర్ఆర్సీ జిల్లా కోఆర్డినేటర్ దార్ల కోటేశ్వర రావు, ప్రకాశం జిల్లా బాలల సంరక్షణ అధికారి డి. దినేష్ కుమార్, ఐసీడీఎస్ పీడీ ఎస్ సువర్ణ అధ్వర్యంలో జిల్లా కలెక్టర్ రాజా బాబును కలిసి కలిసారు. విషయాన్ని వివరించి తల్లిండ్రుల సమక్షంలో చిన్నారులను ఒంగోలు బాల సదనంకు తరలించించారు.
