బేగంపేట అక్టోబర్ 7(జే ఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఇన్స్పెక్టర్ పి.సైదులు ను బేగంపేట డివిజన్ కాంగ్రెస్ నాయకులు నసీరుద్దీన్ (అడ్డూ)ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కలిశారు. ఈ సందర్భంగా బొకే,శాలువా తో సత్కరించారు.అభినందనలు తెలియజేసారు.ఇన్స్పెక్టర్ ను కలిసి అభినందనలు తెలియ జేసిన వారిలో అడ్డూ తో పాటు సిద్దిక్ ఖాన్, అయూబ్,షేక్ సిద్ధికి ,ఇలియాస్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ సైదులు మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో ప్రజల సహాకారం ఎంతో అవసరమని,అన్నారు.ప్రజల సహకారం తో బేగంపేట డివిజన్ ను ప్రశాంతంగా ఉంచేందుకు కృషి చేస్తానని అన్నారు.
