మానవాళికి రామాయణం లాంటి మహత్తరమైన గ్రంథాన్ని అందించిన మహానుభావుడు మహర్షి వాల్మీకి అని, వారి జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పేర్కొన్నారు .
మంగళవారం మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు జిల్లా బిసి సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఘనంగా జరిగింది. ముందుగా జిల్లా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు, జ్యోతి ప్రజ్వలన చేసి మహర్షీ వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వాల్మీకి రచించిన రామాయణం నేడు యావత్ ప్రపంచానికే ఆదర్శమని కొనియాడారు. వాల్మీకి మహర్షి జయంతిని పురష్కరించుకొని వారి జీవిత చరిత్రను ఒకసారి స్మరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. మహానుభావుల జయంతులు, ఉత్సవాలు జరుపు కోవడమంటే కేవలం వారిని స్మరించుకోవడంతో పాటు వారు సమాజానికి చేసిన సేవలు ప్రజలందరికి తెలియ చేసుకోవడమేనని అన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను జరుపకుంటున్నారన్నారు. వారి జీవితంలో జరిగిన మార్పు ఒక వేటవానిగా జీవితం ప్రారంభించి, ఋషి అయి, ఋషి నుండి రామాయణం వంటి మహా కావ్యాన్ని రచించిన మహనీయులు వాల్మికి అని అన్నారు. అన్నదమ్ముల మద్య ఎట్లా సంబంధాలు ఎలా ఉండాలి, కుటుంబ సంబంధాలు ఎలా ఉండాలి, సమస్య లను ఎట్లా పరిష్కరించాలి, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ధర్మం వైపు ఎట్లా వుండాలి అని సమాజానికి తన కావ్యం ద్వారా తెలియచేసిన మహా వ్యక్తి మహర్షి వాల్మీకి అని అన్నారు. ఈ రోజుకు వారు రచించిన రామాయణ మహా కావ్యం అజరామంగా విరాజిల్లుచున్నదని అన్నారు. ఈ కావ్యం మనందరికి ఆదర్శం కాబట్టి వారి జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బిసి వెల్ఫేర్ అధికారి నిర్మలా జ్యోతి, జిల్లా పంచాయితీ అధికారి వెంకటేశ్వర రావు, పలు బిసి సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

