ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవం, పురస్కరించుకొని ఒంగోలు పట్టణంలోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో ఘనంగా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి సి. హెచ్ ఓబులేసు అధ్యక్షతన నిర్వహించిన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని, వృద్ధులు మరియు సంఘాలు, మరియు వృద్ధాశ్రమ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పాల్గొని వృద్ధుల సంక్షేమం మరియు రక్షణ కోసం ప్రతిజ్ఞ చేశారు. వయో వృద్ధులుకు ప్రేమ మరియు గౌరవంతో జీవించగలిగే వారి కోసం ఒక సహాయక మరియు సమ్మిళిత సమాజాన్ని రూపొందించడానికి మనం కలిసి సంకల్పిద్దాం అన్ని ప్రతిజ్ఞ చేయించిన్నారు. ఈ సందర్భంగా సి. హెచ్. సువార్త, సహాయ సంచాలకులు , విభిన్న ప్రతిభావంతులు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ ప్రతినిధులు మాట్లాడుతూ వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం అవసరమైన సహాయాన్ని మరియు చర్యలును అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని తెలిపారు. స్వచ్ఛందంగా కళాశాల విద్యార్ధులు పాల్గొన్ని, వృద్ధుల పట్ల బాద్యత గా మెలగాలని వారి సంరక్షణకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని ఉపన్యాసం ఇచ్చిన్నారు, ఈ సందర్భంగా కొందరు వృద్ధులు తమ సమస్యలను తెలియజేయగా, జిల్లా రెవిన్యూ అధికారి వాటిలో కొన్ని సమస్యలను వెంటనే తగు రీతిలో పరిష్కరించారు. వృద్ధాశ్రమ నిర్వాహకులు, వృద్ధుల సంఘ ప్రతినిధులు తమ అనుభవాలను సభాముఖంగా పంచుకుని, సమస్యల పరిష్కారం కోసం అభ్యర్థనలు సమర్పించారు. ఈ సందర్భంగా వృద్ధుల సేవలో విశేషంగా సహకరించిన వృద్ధులను సన్మానించిన్నారు. అవసరమైన వృద్ధులకు చేతి కర్రలు వారి దిన చర్యలు కు ఉపయోగం చేసేందుకు పంపిణీ చేశారు.

