రెవెన్యూ అంశాల ప్రజా సేవల పనితీరు పట్ల ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేసేలా ప్రత్యేక దృష్టి సారించాలని సిసిఎల్ఏ ప్రత్యేక కార్యదర్శి జయలక్ష్మి
జిల్లా కలెక్టర్లకు సూచించారు.
విజయవాడ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి మంగళవారం అన్నదాత సుఖీభవ, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, కాస్ట్ సుమోటో డ్రైవ్, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిసిఎల్ఎ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేసారు. ఈ సందర్భంగా సిసిఎల్ఎ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి మాట్లాడుతూ… రెవెన్యూ అంశాల ప్రజా సేవల పనితీరు పట్ల ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేసేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాజముద్రతో తయారు చేసిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం పటిష్టంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాల్లో చేపట్టిన రీ సర్వే ప్రక్రియ ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు.
ఈ వీడియో కాన్ఫెరెన్స్ కు ఒంగోలు కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫెరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు , జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారి గౌస్ భాషా, కలెక్టరేట్ ల్యాండ్ సెక్షన్ సిబ్బంది తదితరులు తదితరులు పాల్గొన్నారు.
