ప్రకాశం జిల్లాను గంజాయి, మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చే లక్ష్యంతో, జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీసులు మంగళవారం పొదిలి మరియు దర్శి ప్రాంతాలలో ఆకస్మిక, విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ముఖ్యంగా గంజాయి కేసుల్లో గతంలో నిందితులుగా ఉన్నవారి ఇళ్లతో సహా రద్దీ ప్రాంతాల లో తనిఖీ చేశారు.
తనిఖీలలో డాగ్ స్క్వాడ్ గంజాయి మరియు మాదకద్రవ్యాలను గుర్తించడంలో శిక్షణ పొందిన రాక్సీ జాగిలాంతో పాటు పోలీసులు తనిఖీ నిర్వహించారు.
పొదిలిలో తనిఖీలు…
పొదిలి ఆర్టీసీ బస్టాండ్ పార్సిల్ పాయింట్, పొదిలిలోని బెస్తపాలెం ఏరియాలో గతంలో గంజాయి కేసుల్లో నిందితులగా ఇళ్లను సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై వేమన మరియు సిబ్బంది రాక్సీతో కలిసి తనిఖీ చేశారు.
దర్శిలో తనిఖీలు….
దర్శి గడియారం స్తంభం మరియు ఆర్టీసీ బస్టాండ్‌తో పాటు ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో, అనుమానాస్పద వస్తువులు, లగేజీలు మరియు పార్కింగ్ ప్రదేశాలను దర్శి సీఐ రామారావు, ఎస్సై మురళి మరియు సిబ్బంది రాక్సీ సాయంతో తనిఖీ చేశారు.
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు నేర నియంత్రణ విషయంలో ఎటువంటి రాజీ ఉండదని పోలీసులు స్పష్టం చేశారు. ప్రజల భద్రతే తమ ప్రధాన ప్రాధాన్యతమని పేర్కొంటూ, జిల్లా పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని తెలిపారు.
అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు లేదా వాహనాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని లేదా తక్షణ సహాయం కోసం డయల్ 112 కు కాల్ చేయాలని జిల్లా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


