తాళ్లూరు మండలంలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో మంగళవారం సూపర్
జీఎన్టీ నూపర్ సేవింగ్స్ పై విద్యాశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. తాళ్లూరు వి.కె ఉన్నత పాఠశాలలో ఎంపీడీఓ అజిత, మండల విద్యాశాఖాధికారి -1 గురజాల సుబ్బయ్య, డిప్యూటీ ఎంపీడీఓ నాగ మల్లేశ్వరి, గ్రామ కార్యదర్శి షహనాజ్ వేగం వేల్ఫేర్ అసిస్టెంట్ ఉమా మాధవి తదితరులు పాల్గొని గూడ్స్ సర్వీస్ టాక్స్ తగ్గించటం వలన సామాన్య మధ్య తరగతి కుటుంబాలకు కలిగే ప్రయోజనాలు తెలుసుకోవాలని, విద్యార్థులు తల్లిదండ్రులకు వివరించి, కొనుగోలు సమయంలో మోన పోకుండా ఉండాలని చెప్పారు. వ్యాపారుల వద్ద ఎవైనా అవకతవకులు ఉంటే తక్షణమే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తగిన న్యాయ పొందాలని కోరారు.

