ప్రజలకు, రైతులకు ఉపయోగపడేలా ఉచిత వైద్యశిబిరం జిమ్స్ వైద్యశాల ఆధ్వర్యంలో నిర్వహించటం అభినందనీయమని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అన్నారు. తాళ్లూరు రైతు సేవా కేంద్రం – 1లో మంగళవారం ఒంగోలు జిమ్స్ వైద్యశాల ఆధ్వర్యంలో కంటి వైద్యశిబిరం నిర్వహించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, వైన్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. 40 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను సిఫార్స్ చేసారు. ఎంపీడీఓ రజిత, ఎంఈఓ×1 సుబ్బయ్య, డిప్యూటీ ఎంపీడీఓ నాగమల్లేశ్వరి, గ్రామ కార్యదర్శి షహనాజ్ బేగం, పంచాయితీ సిబ్బంది, జిమ్స్ ఆఫ్తాలమిస్ట్ విభాగంకు చెందిన నిపుణులు సాయిరాం, రాఘవి, కునుమ లు పాల్గొన్నారు.
