తాళ్లూరు మండలంలోని బొద్దికూరపాడులో మంగళవారం ఈ – పంట నమోదు సూపర్ చెక్ను వ్యవసాయాధికారి ప్రసాద రావు నిర్వహించారు. బొద్దికూరపాడు, వెలుగు వారి పాలెంలలో ఈ – పంట నమోదు వివరాలు, వర్షాధారితం, బోరు వంటి వివరాలు సూపర్ చెక్ నిర్వహించి వివరాలు రాబట్టారు. పొరపాటున పంట వివరాలు, విస్తీర్ణాలు, రైతు వివరాలు తప్పుగా నమోదు అయితే నరిచేయటం వీలు కాదని రైతులకు వివరించారు. విఏఏ లు బాధ్యతగా నమోదు చెయ్యాలని సూచించారు. విఏఏ ఆదినారాయణ రైతులు పాల్గొన్నారు
